-
అమెరికాలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
-
50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా యూఎస్ టూర్
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. పది రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన రేవంత్ అండి టీం బిజిబిజీగా గడుపుతోంది. ఈ పర్యటనలో పలు దిగ్గజ సంస్థసలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. న్యూజెర్సీలో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఐ సెల్ షెరటాన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరారు ముఖ్యమంత్రి.
తెలంగాణలో పెట్టుబడుదారులు పెట్టే వారికి, సంస్థలకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్ఐర్ఐలు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు తెలిపారు. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు రంగాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు.
స్కిల్ యూనిర్సిటీకి సహకారం అందించాలని మహీంద్రా గ్రూప్ తచైర్మెన్ ఆనంద్ మహీంద్రాతో సైతం చర్చిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని కామెంట్ చేసిన ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం కేవలం 90 రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేశామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
మొత్తం 10 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్ ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. గూగుల్, కాగ్నిజెంట్, అమెరికన్ ఎయిర్ లైన్స్, ఎల్జీ, శాంసంగ్, పీ అండి జి వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్న రేవంత్ అండి టీం పెట్టుబడులకు సంబందించిన అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది. మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు ఆర్దిక సాయం కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 14 న ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది రేవంత్ రెడ్డి బృందం.