Wednesday, April 2, 2025

2,450 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూమ‌లు బ‌ద‌లాయించండి

  • ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
  • వ‌రంగ‌ల్ సైనిక స్కూల్ అనుమ‌తులు పున‌రుద్ధరించాలని విజ్ఞప్తి

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్తర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్షణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్తర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు ర‌క్షణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్షణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్పగించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం, ర‌క్షణ శాఖ భూముల ప‌ర‌స్పర బ‌దిలీకి అంగీక‌రించాల‌ని రక్షణ శాఖ మంత్రికి విజ్ఙప్తి చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధరించాల‌ని, తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి వెంట నాగ‌ర్‌క‌ర్నూల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌,జ‌హీరాబాద్‌, భువ‌న‌గిరి, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్, పెద్దప‌ల్లి ఎంపీలు మల్లు రవి, రామ‌స‌హాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్,సురేష్ షెట్కార్, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి,కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ స‌భ్యుడు అనిల్ కమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యద‌ర్శి బి.అజిత్ రెడ్డి ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com