Thursday, December 26, 2024

చరిత్ర పేజీలో నల్లగొండ జిల్లా పేరు రెపరెపలాడుతుంది

సోనియాగాంధీ ఆశీస్సులతో తెలంగాణ తెచ్చుకున్న మనం 10ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చి ఆ కలలను నిజం చేసుకుంటున్నామని ఉమ్మడి రాఫ్ట్రంలో ఎంత ప్రయత్నించినా సంపూర్ణ సహకారం అందలేదని తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మనం అభివృద్ధి పదాన నడుస్తున్నామని తొలి దశ తెలంగాణ ఉధ్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఏవిధంగానైతే పదవి త్యాగం చేసి పోరాడారో మలిదశ తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ ముద్దు బిడ్డ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని వదిలి ఉధ్యమంలో పాల్గొని పదవులను ఆశించకుండా పోరాడిన విప్లవాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా పేరు చరిత్ర పుటల్లో రెపరెపలాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మించిన 800ల మెగా వాట్ల యాదాద్రి పవర్‌ప్లాంట్‌ యూనిట్‌` 2 ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి నల్లగొండ బయలుదేరి వెళ్లారు. నల్లగొండలో మెడికల్‌ కాలేజితో పాటు భ్రాహ్మణవెల్లంలో ఉదయ సముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్కీమ్‌ ద్వారా నిర్మితమైన కెనాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎల్‌బిసి ఆవరణలోని రాజీవ్‌ ఇంటిగ్రేటెడ్‌ మైదానంలో లక్ష్యమందితో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు.

ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఈ ప్రాంతం వాడేనని ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా ఆ నాటి సాయుధ పోరాటమే గుర్తు వస్తుందని, భూమికోసం భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన నల్లగొండ గాలి పీల్చితే ఆ ధైర్యం మళ్ళీ వస్తుందని గుర్తుచేశారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్‌ ద్వారా తరతరాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యను విముక్తి చేసి 500ల గ్రామాలకు తాగునీటి పైపులను వేసి ఆదుకుంటున్న ప్రభుత్వం మన కాంగ్రెస్‌ ప్రభుత్వందేనన్నారు. ఈ నల్లగొండ జిల్లాలో 12 స్ధానాలకు 11 స్ధానాలు గెలిపించి 2 ఎంపీ స్ధానాలను గెలిపించిన ఈ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఊపిరి అయినా వదులుతాము గానీ మూడు రంగుల జెండాను వదలమని గెలిపించిన ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకుంటామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇరిగేషన్‌శాఖా మంత్రిగా నియమించడంలో ఉన్న అర్ధం ఈ ప్రాంతంలో అన్నీ పెండిరగ్‌ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేయడం కోసమేనని తెలంగాణ రాఫ్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలనే సంకల్పమేనన్నారు. వరి పండిరచిన రైతులు ఉరి వేసుకోవడమేనని అన్న  కేసీఆర్‌ను ఈ ప్రాంత ప్రజలు  బొందపెట్టారని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరిని పండిరచండి రూ.500ల బోనస్‌ ఇవ్వండి అని చెప్పి ఆచరణలో పెట్టామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తి అవుతున్న సందర్భాన నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు రాఫ్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయన్నారు.

గత నెల నుండ రైతు పండగ పేరుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ ప్రజాపాలన భహిరంగ సభ నుండి మొదలుకుని నేటి నల్లగొండ సభ వరకు లక్షలాదిమంది ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాపాలనలో మేమంతా సంతోషంగా ఉన్నామని పండుగలు చేసుకుంటూ ఉంటే దిక్కుదివాణాలేని బిఆర్‌ఎస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలతో ఇబ్బందులు పెట్టే చర్యలు చేసేందుకు ప్రయత్నాలు, కుట్రపూరితమైన ప్రణాళికలు చేసుకుంటున్నారన్నారు. రేవంత్‌సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులు తమ దుర్భుద్దితో కూడిన ఆలోచనలు చేయడం సిగ్గుచేటన్నారు. జరుగుతుందని అన్నారు.  కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మాకు అప్పగిస్తే మేము దానిని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వందరోజుల్లో తెలంగాణను బయటపడేసేందుకు పనిచేస్తున్నామన్నారు. రూ.16వేల కోట్లతో మిగులు బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉంటే కేసీఆర్‌ పదేండ్ల తర్వాత రూ.7లక్షల కోట్ల అప్పుతో మాకందించాడు. దానిని మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే పార్టీ పెద్దగా కేసీఆర్‌ బుద్ది చెప్పాల్సింది పోయి వారిని ప్రోత్సహించడందుర్మార్గమైన ఆలోచనలు చేసే వారిని వదిలేస్తే మంచిది కాదని వారిని నియంత్రించేందుకు  తమ ప్రభుత్వం, చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతారన్నారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి తీరుతామని ఎవరికీ ఎక్కడా కాంప్రమైజ్‌ అయ్యేది లేదన్నారు.

image.png

డిల్లీ తరహా దుస్ధితి రాకుండా వాహన కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు చేపడుతున్నామన్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమంతో పాటు కాలుష్య నివారణ చర్యల్లో బాగంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వ హాయాంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్టీసి వ్యవస్దను తమ ప్రభుత్వం గాడిలో పెట్టి మహాలక్ష్మీ పథకం ద్వారా లాభాల బాట పట్టించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట నిలబెట్టుకుంటుందని అందుకు రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 4వ విడతగా రూ.2700 కోట్లను విడుదల చేశామన్నారు. రానున్న సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా రైతు భరోసాను అందిస్తామని ప్రకటించారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించామన్నారు. మేము ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉన్నాము, గెలిస్తే సంబరాలు చేసుకోలేదని, ఓడితే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌లాగా ఉండలేదన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. ఓ గాలి బ్యాచ్‌ను తయారు చేసి గాలికి వదిలిని కేసీఆర్‌ ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుండేదన్నారు. పరీక్షలు పెట్టొద్దు, ఉద్యోగాలు ఇవ్వొద్దు అని గాలి బ్యాచ్‌ ద్వారా ప్రచారం చేయడం న్యాయమేనా కేసీఆర్‌ అని ప్రశ్నించారు. తెలంగాణ కొట్లాడిరదే ఉద్చోగాల కోసం అని ఆ విషయాన్ని మరిచిపోవడం నీ బలుపుకు పరాకాష్ట కాదా అని అన్నారు. 1200మంది బలిదానాలు చేసుకుంటే ఈ నలుగురు ముఖ్యమంత్రులుగా నియంతపాలన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ దోపిడిని తరిమికొట్టి ఏడాది పాలనలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్‌కు లెక్కకట్టి బరాబర్‌గా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెబుతామన్నారు.

దేశంలో ఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వలేదని అది మన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికే ఆ ఘనత దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బిజెపి నాయకుడు నడ్డా ఏది పడితే అది మాట్లాడి కేసీఆర్‌లాగా అబాసుపాలు కావద్దని హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 21వేల కోట్లతో మొదటి దశ రూ.2లక్షల రుణమాఫీ చేశామని అందులో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2004కోట్లు రుణమాఫీ జరిగిందనే విషయం సంతోషంగా ఉందన్నారు.ఇవ్వలేదని ఇచ్చిన ప్రతి హామీని నిరవేరుస్తామని వాగ్దానం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇచ్చి 50లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. ఉచిత కరెంట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెటెంట్‌ అని గుర్తు చేశారు. గ్యాస్‌ సిలెండర్‌కురూ. 1200 చెల్లిస్తే మోడి ఎత్తుకుపోతున్నాడని సోనియమ్మ చెబితే అధికారంలోకి రాగానే రూ.500ల సబ్సిడీని ఇచ్చి ఆదుకున్నది మన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 2రోజుల్లోనే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సబ్సిడీని పెంచి ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత మనదే అన్నారు. 35వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి 25వేల మందికి ప్రమోషన్‌లు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్‌దేనన్నారు. పోలీసులకు స్వేచ్ఛను కల్పించి వారిపనిని వారు చేసుకునే విధంగా అవకాశం ఇచ్చామన్నారు. మన ప్రభుత్వంలోని మంత్రులు ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటే ఖాళీగా ఉన్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ నాయకులు సోషల్‌మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని గలీజు హామీలు ఇవ్వలేదని ఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, మిత్తీ కలిపి రూ.65వేల కోట్లు కడుతున్నామన్నారు.

ఎవరు ఎన్ని మాటలు చెప్పిన వినవద్దని రైతులు సన్నాలే పండిరచండి, రూ.500లు బోనస్‌ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామన్నారు. రేషన్‌, పాఠశాలలకు మీరు పండిరచిన సన్న బియ్యాన్ని పంపిణీ చేసి మన ధాన్యాన్నే బియ్యంగా మార్చుకుని తిందామని చెప్పారు. నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేను కలిసి కేంద్రమంత్రి నితిన్‌గడ్కారి వద్దకు వెళ్లామని నేను రీజనల్‌ రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదన చేస్తే మన కోమటిరెడ్డి నల్లగొండకు ఔటర్‌ రింగ్‌రోడ్డును అడగగా నితిన్‌గడ్కారి కోమటిరెడ్డికే మద్ధతు ఇచ్చాడని, రీజనల్‌ రింగ్‌రోడ్డుకు రూ.35వేల కోట్ల బడ్జెట్‌ కాగా నల్లగొండ రింగ్‌రోడ్డుకు రూ.400కోట్లు బడ్జెట్‌ ఉంటుందని అంచనా వేశారు. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఫ్యూచర్‌ సిటీని ఏర్పాటు చేసి 55వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. మూసీ ప్రాజెక్ట్‌ కట్టాలా వద్దా అని జిల్లాలో ఉన్న ఏకలింగాన్ని అడగాలని వద్దూ అంటే మూసీలో ముంచాలని అన్నారు. ఎవరు ఎన్ని అన్నా మూసీ ప్రాజెక్ట్‌ కట్టి తీరుతామని అడ్డు వస్తే అడ్డుకునే బాధ్యత ప్రజలదేనన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ అంటే పోరాటాల గడ్డ అని ఆ నాటి రజాకారుల నుండి మొదలుకుని 2014 తెలంగాణ సాధన వరకు నల్లగొండ జిల్లా ప్రాముఖ్యత చాలా గొప్పదన్నారు. నల్లగొండ అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట అని ఈ జిల్లా  ప్రజలందరికీ కాంగ్రెస్‌ పార్టీ రుణపడి ఉంటుందన్నారు. ఎస్‌ఎల్‌బిసి స్వరంగాన్ని 2 ఏండ్లలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, ఈ స్వరంగానికి ఆర్‌ఆర్‌ అని పేరు పెట్టామని ఆర్‌ అంటే రాజశేఖర్‌రెడ్డి అని ఆర్‌ అంటే రేవంత్‌రెడ్డి అని చెప్పారు. గత ప్రభుత్వంలో పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు అన్నింటినీ మన ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. నేడు 300 కోట్లతో మెడికల్‌ కాలేజీని 40కోట్లతో నర్సింగ్‌ కాలేజీని నిర్మించుకుందామన్నారు.  2014కు ముందు కేసీఆర్‌ కుర్చీ వేసుకుని కూర్చుంటా అని చెప్పి కూలేశ్వరాన్ని (కాళేశ్వరం) కట్టి నాశనం చేశాడన్నారు. పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  ఉత్తమ్‌:కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో పాటు టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జయ్‌వీర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతి, వేముల వీరేశం, వీర్ల ఐలయ్య, నల్లగొండ జిల్ల డిసిసి అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలతో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు నామిరెడ్డి మట్టారెడ్డి, పగిడి రామలింగయ్య యాదవ్‌, అధికారులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com