Tuesday, December 24, 2024

అల్లు అర్జున్ నివాసంపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాదులో స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రకటన
శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు

హైదరాబాదులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి జరగడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com