Wednesday, March 12, 2025

రాజారిత్విక్‌కు అభినందనలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు చెందిన రాజారిత్విక్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్ షిప్‌లో రజత పథకం గెలుచుకున్న సందర్భంగా, అతడికి అభినందనలు తెలియజేస్తూ సిఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో రిత్విక్ సిల్వర్ మెడల్ సాధించారని ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ప్రచురించిన కథనాన్ని ట్విట్‌లో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరిగిన లాప్లాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్‌లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుపొందిన రాజరిత్విక్ యువ చెస్ స్టార్ అవ్వడం ఆనందంగా ఉందని సిఎం రేవంత్ తెలిపారు.

అలాగే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌కు సిఎం అభినందనలు తెలియజేశారు. ఇక అతను టోర్నీలో అజేయంగా నిలిచారని, ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కేవలం ఆఫ్ పాయింట్‌తో కోల్పోయారని సిఎం రేవంత్ ఎక్స్‌లో పేర్కొన్నారు. అతడు ఇకముందు మరింతగా రాణించాలని కోరుకుంటూ, అతని ముందున్న ప్రయాణంలో అన్ని విధాల సహాయ, సహాకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నానని సిఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com