భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగాం పట్టణానికి చెందిన మెరుగు కౌశిక్ సివిల్స్ (యూపిఎస్సీ)లో 84వ ర్యాంకు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను సన్మానించారు.
ఆయనకు పుష్ఫగుచ్చం అందించి సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎంపి బలరాం నాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లు ఉన్నారు.