Friday, December 27, 2024

cm revanth reddy delhi tour మళ్లీ ఢిల్లీకి.. సీఎం రేవంత్ రెడ్డి

రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఈనెల 11న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఈనెల 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎంతోపాటు మంత్రి సీతక్క, ఇతర మంత్రులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై పలువురు ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. ఈ అంశం కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో, లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు నేడు అసెంబ్లీ సమావేశాలు జరగగా, ఈనెల 16వ తేదీకి సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com