- సిఎం ఆదేశాలతో నిరుద్యోగులతో మాట్లాడిన ఆరుగురు సభ్యుల కమిటీ
నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తనకు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారంటూ పార్టీ నేతలపై, అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఆదివారం గాంధీ ఆస్పత్రిలో నిరవధిక దీక్ష చేస్తున్న మోతీలాల్ తో పాటు నిరుద్యోగులతో మాట్లాడింది. సోమవారం ఉదయం పలువురు నిరుద్యోగులను గాంధీభవన్‌కు పిలిపించుకొని చర్చించింది.
ఈ సందర్భంగా వాళ్లు ప్రధానంగా నాలుగు డిమాండ్లను కమిటీ ముందుంచారు. వాటిని నోట్ చేసుకున్న కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. ఈ నాలుగు అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
డిమాండ్‌లు ఇలా…
గ్రూప్-1 లో 1:100 పద్ధతిలో ఇంటర్వూలకు పిలవాలి. గ్రూప్-2,3లో కొలువుల సంఖ్యను పెంచాలి. గ్రూప్-2 ను డిసెంబర్‌లో నిర్వహించాలి. డీఎస్సీని ఆగస్టులో నిర్వహించాలి.