Friday, November 15, 2024

మా మాటే శిలాశాసనం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం రేషన్​ కార్డు లేకున్నా రుణమాఫీ

  • మా మాటే శిలాశాసనం
  • ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం
  • రేషన్​ కార్డు లేకున్నా రుణమాఫీ
  • సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరొక్కసారి రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. మొదటిదశలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్‌ గురువారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి రైతులతో మాట్లాడిన ఆయన.. తొలివిడతగా రూ.1లక్ష లోపు రైతు రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు.

రైతు డిక్లరేషన్‌లో భాగంగా రుణమాఫీ

వరంగల్​లో రైతు డిక్లరేషన్​సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేశామని, ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిందన్నారు. ఇది తన జీవితంలో మరుపురాని రోజు అని, గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదని, రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి రూ.లక్షన్నర రుణాలను మాఫీ చేస్తామని, పాస్‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని అన్నారు. కేవలం కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్‌ కార్డు ప్రామాణికం అని, రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవని, అందుకే పాస్‌బుక్‌ను ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుందని సీఎం అన్నారు. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు.

కాగా, ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌ చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు రుణ మాఫీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన గౌడ్ లైన్స్ పై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్‌ సర్కార్‌కు పలు ప్రశ్నలు సంధించారు. లక్షలోపు రుణాలు ఉన్న రైతులు రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మంది ఉంటే 11 లక్షల మంది రైతులను మాత్రమే ఎలా ఎంపిక చేశారు? అని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాల మాఫీ కోసం రూ.16,144 కోట్లు ఖర్చు చేసి 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular