Monday, November 18, 2024

‘విట్టీలీక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి

సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ జ్ఞాపకాలను ‘విట్టీలీక్స్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని సిఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈనాడు తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా 1988లో తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కథలు, జ్ఞాపకాల పేరుతో సాయి శేఖర్ ‘విట్టీలీక్స్‘ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ఎక్కువగా ప్రసిద్ధ వ్యక్తుల సరదా సన్నివేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ముఖ్యమంత్రులకు సంబంధించిన సన్నివేశాలను ఇందులో ఎక్కువగా పొందుపరిచారు.

ఎన్‌టి రామారావుతో మొదలై, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కెసిఆర్, ఎ.రేవంత్‌రెడ్డి వంటి ప్రముఖులకు సంబంధించిన సన్నివేశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి శేఖర్‌ను అభినందించారు. ముఖ్యమంత్రి తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు సాయి శేఖర్ సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular