Wednesday, May 14, 2025

ఈనెల 16వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం

  • ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చ
  • త్వరలో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి

ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ఈనెల 16వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సచివాలయంలో 16వ తేదీన ఉదయం 9.30 గంటలకు సిఎం సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్‌లను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుంది. ఇటీవలే అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సిఎం సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని క్షేత్రస్థాయిలో పాలన వ్యవస్థ మరింత పటిష్టం కావాలని సిఎం సూచించారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు అధికారులతో సిఎం తెలిపారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సిఎం రేవంత్ త్వరలో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com