‘1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించిన రైతన్నలు
ఎకరాకు రూ. 12 వేల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం
ఎక్స్‌లో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
‘1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టిన రైతన్నకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఇది. ఎకరాకు రూ. 12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేసే ఈ ప్రయత్నం తనకు గొప్ప తృప్తిని ఇస్తోందని, జై కిసాన్ అంటూ సిఎం ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌ను అమలు చేస్తోంది. దీంతో సన్నాలను సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.