జనగామ జిల్లా బాలుడి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ బాలుడికి అవసరమైన నిధులు, చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను వైద్య శాఖ అధికారులు చేపట్టారు.
జనగామ జిల్లాకు చెందిన రెండున్నరేండ్ల బాలుడు మాధవన్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలుడి తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ బాలుడికి అవసరమైన శస్త్రచికిత్స, అందుకు అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్-, అలేఖ్య దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి, తక్షణ సాయానికి ఆదేశించింది.
ఆ మేరకు సంబంధిత అధికారులు బాలుడి తల్లిదండ్రు లను సంప్రదించి, వారి సమ్మతితో హైదరాబాద్ నిమ్స్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే నిధులను ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) ద్వారా అందించాలని నిర్ణయించారు.