ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్రవ్యాపంగా కురుస్తున్న వర్షాలపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గురువారం సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వర్ష ప్రభావం గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడటంపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.