రవీంద్రభారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారు.
హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారు.
మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం,ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం.
దేశంలో ఉన్నవి రెండే పరివార్ లు.
ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్..
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తోంది.
దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోంది.
దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు.
ముస్లింలను మేం ఓటర్లుగా చూడటంలేదు.. సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు.. అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది.
కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా చేసాం, అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చాం.
కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చాం.
వైఎస్ తరువాత ఇప్పటి వరకు సీఎంఓ లో మైనారిటీ అధికారిని నియమించలేదు.
మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించాం.
దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.
మోదీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోండి.
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలి.
దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
మహారాష్ట్రలో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయండి.
దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు.