Tuesday, May 13, 2025

మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కుండపోతకు అవకాశం
ఐఎండి హెచ్చరిక…అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ

వానా కాలం మొదలైనా ఇప్పటి వరకు వరుణుడు కరుణంచక ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోభారత వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి వాన కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొడతాయని అంచనా వేస్తుంది. అంతేకాదు… అన్ని  జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌కూడా జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధప్రదేశ్‌ ‌తీరం వి•దుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణలో వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ  ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడ కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని… వాతావరణ శాఖ  అధికారులు తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలోకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ‌జారీ చేశారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం కురిసే సమయంలో గాలుల వేగం పెరగే  అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే… నిజామాబాద్‌, ‌కామారెడ్డి, కరీంనగర్‌, ‌మెదక్‌, ‌సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో కూడా వర్షాలు కురుస్తాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధప్రదేశ్‌ ‌తీరం వి•దుగా కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం ప్రభావంతో…మరోవైపు కేరళ నుంచి గుజరాత్‌ ‌తీరం వెంబడి ద్రోణి విస్తరించి ఉండడం కారణంగా… అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో… దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతాయని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్టాల్ల్రోనే కాకుండా 11 రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికను జారీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com