Thursday, May 1, 2025

కులగణనపై తెలంగాణ మాట చెల్లింది

కేంద్ర నిర్ణయంతో రాహుల్‌ ‌గాంధీ విజన్‌ ‌సాకారం
తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది..
కేంద్రానికి సిఎం రేవంత్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు

కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్యాబినెట్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో రాహుల్‌ ‌గాంధీ విజన్‌ ‌సాకారం కాబోతోందని పేర్కొన్నారు. రాహుల్‌ ‌విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే. రాహుల్‌ ‌విజన్‌తో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. కుల గణన కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా పోరాడింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేతలు దిల్లీలోనూ ఆందోళన చేశారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైందని  అన్నారు.

కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కులగలను చేయాలని రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారని, భారత్‌ ‌జోడో యాత్రలో చెప్పిన మాట ప్రకారం కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం అసెంబ్లీ తీర్మానం చేశామని, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్‌ ‌గాంధీ విజన్‌ అమలులోకి వొచ్చిందని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని, కులగణన చేయాలని కేంద్ర నిర్ణయించడానికి స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయమై సీఎం ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం : మంత్రి పొన్నం
జాతీయ జనగణనలో కుల గణన చేర్చడం తెలంగాణ ప్రభుత్వ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి పంపింది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు తెలంగాణ లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్‌ ‌చేశామని పొన్నం తెలిపారు.

కులగణన చేసి తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని, ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ జన గణన ద్వారా జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ, ప్రజల విజయమని ఆయన అన్నారు. 1931లో బ్రిటిష్‌ ‌కాలంలో జాతీయ స్థాయిలో కుల గణన జరిగిందని.., ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం సహకరించిన ముఖ్యమంత్రికి ,ఉప ముఖ్యమంత్రికి సహచర మంత్రులకు, పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ఆలస్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని మంత్రి వ్యాఖ్యానించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com