- కార్యకర్తలు సైనికులు
- కాంగ్రెస్ ఓ మహా సముద్రం
- అందులో కార్యకర్తలు నీటి బిందువులు కాదు
- ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, సైనికులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కొనియాడారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రం అని, కార్యకర్తలు నీటి బిందువులు కాదనీ, పేదల బంధువులని సిఎం రేవంత్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తమ కార్యకర్తలు జెండా మోసే బోయీలు మాత్రమే కాదనీ, ఎజెండాలు నిర్ణయించే నాయకులని సిఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
త్యాగశీలురైన కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తలు తెగించి కొట్లాడే వీరులని సిఎం రేవంత్ అభివర్ణించారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శబ్ధమిది అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.