సార్వత్రిక సమరానికి కొంత సమయమే మిగిలి ఉన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
“ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్ల వల్లే పురోగమన దిశలో పయనించారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఆశీర్వదించండి” అని రేవంత్ కోరారు.