Friday, May 9, 2025

త్వరలో జమ్మూకశ్మీర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం
2024 ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి అత్యధిక స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో విడుదల చేయనుంది. అలాగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను మొత్తం 27 మందితో స్టార్ క్యాంపెయినర్లను కూడిన జాబితాను కెసి వేణుగోపాల్ శనివారం విడుదల చేశారు.

ఇందులో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి స్థానం దక్కింది. దీంతో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులతో పాటు, ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం జమ్మూకశ్మీర్‌కు వెళ్లి అక్కడ ప్రచారం చేయనున్నారు. కాగా ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతానికి రాలేదు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com