Tuesday, March 11, 2025

నేడు తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, అందుకనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ‘తెలంగాణ మేనిఫెస్టో’ను సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో రేవంత్ రెడ్డి వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించే హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్ పత్ర’ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు విడుదల చేసే స్పెషల్ మ్యానిఫెస్టోలో ఎలాంటి హామీలను ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com