Sunday, October 6, 2024

జిల్లాలకు వస్తా త్వరలో వారానికొక జిల్లా పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి

అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. అదేవిధంగా చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

రెండు వారాల్లో ప్రతీ అధికారి ఒక ఫ్లాగ్​షిప్ ఐడియాను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు వారానికి ఒక రోజు క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని తెలిపారు. అలాగే నెలకోసారి జిల్లా అధికారులతో సమావేశమై పనుల పురోగతిని తెలుసుకోవాలని సమీక్షలో సూచించారు. కాగా చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తా : కలెక్టర్లు కచ్చితంగా ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వివిధ విభాగాలను సందర్శించాలని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా ప్రజా సమస్యలు, అనూహ్య సంఘటనలు, దుర్ఘటనలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. అధికారులపై వ్యక్తిగత రాగద్వేషాలేమీ లేవన్న ఆయన, పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు లభిస్తాయని ఉద్ఘాటించారు. త్వరలో వారానికి ఒక జిల్లా పర్యటనకు తానే స్వయంగా వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే జిల్లా పర్యటనల షెడ్యూలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular