తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు సిఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సిఎం ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ట్వీట్‌కు సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా భట్టితో నవ్వుతూ దిగిన ప్రత్యేకమైన ఫొటోను జత చేశారు.