Saturday, February 1, 2025

కెసీఆర్ ఒక‌ కాలం చెల్లిన వెయ్యి నోటు..

చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి..
ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో..
కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

ఫాంహౌస్‌కు వొచ్చిన‌వారికి సోది చెప్పుడు కాదు..దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై  కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌  కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కెసిఆర్‌ద‌ని మండిప‌డ్డారు. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేసింది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే..

ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే.. కానీ మేం అధికారంలోకి వొచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం.  మేం రుణమాఫీ చేయలేదంటున్న కెసిఆర్ ఫాం హౌస్‌కు వొచ్చినోళ్లకు జోలి చెప్పుడు కాదు… అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం అంటూ సీఎం రేవంత్ స‌వాల్ విసిరారు. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తామ‌న్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా నీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు. ఆయన గంభీరంగా చూస్తున్నడట…ఎవరిని చూస్తున్నావ్? అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలాడు.

జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేశారు. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కెసిఆర్ అని సీఎం రేవంత్‌ నిప్పులు చెరిగారు. మా ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది. రైతు భరోసానూ ఇస్తున్నాం.  మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తామ‌ని చెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం. మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా నిల‌దీశారు. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే.. సరిగ్గా నిలబడటం నేర్చుకోవాల‌ని అన్నారు. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వొచ్చాయని చెప్పుకుంటున్నాడ‌ని, ప‌దేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వొచ్చాయని చెప్పుకోవ‌డ‌మంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాల‌న్నారు.

కెసిఆర్ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకోవాల‌ని హితువు ప‌లికారు. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం. ఫాంహౌస్‌లో ఉన్న కెసిఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింద‌ని, కెసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు అని ఫైర్ అయ్యారు. కెసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com