-
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసమే
-
సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన
-
తెలంగాణ యువత భవిష్యత్ కోసం అహర్నిశలు
-
శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
టిపిసిసి అధికార ప్రతినిధి, చనగాని దయాకర్
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసమే సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారని టిపిసిసి అధికార ప్రతినిధి, చనగాని దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని వివిధ కంపెనీలు పెట్టుబడులు పెడితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ యువత భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, విదేశీపెట్టుబడుల రాకతో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. స్కిల్ యూనివర్సిటీతో తెలంగాణ యువతకు డిగ్రీ పూర్తి అయినా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి యూఎస్‌ఏ పర్యటన వల్ల రాష్టంలో విదేశీ పెట్టుబడులు పెట్టడంతో ప్రధానంగా యువత భవిష్యత్ మారనుందన్నారు. కెటిఆర్ సెల్ఫీల కోసం విదేశీ పర్యటన చేశారని, కెటిఆర్ హయాంలో తెలంగాణలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2023లో కెటిఆర్ పర్యటన చేసి తెలంగాణలో 42,000 ఉద్యోగాలు అన్నారని, అందులో నలుగురికి కూడా ఉద్యోగాలు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో నిరుద్యోగులుగా పుట్టడం అదృష్టంగా మారనుందన్నారు. పది ఏళ్ల నుంచి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహకారంలో మూసీనది పరివాహక ప్రాంతాలు ముగ్ధ మనోహరంగా మారబోతున్నాయని ఆయన తెలిపారు.