Wednesday, September 18, 2024

అందుకే కవితకు బెయిల్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సచివాలంయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ అనంతరం మీడియాతో సీఎం చిట్ చాట్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని.. ఆ కారణంగానే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ఇదే కేసులో సిసోడియాకు ఎందుకు బెయిల్ ఆలస్యమైందని.. కేజ్రీవాల్ కు ఎందుకు బెయిల్ రావడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్న రేవంత్.. బీఆర్ఎస్ కు ఒక న్యాయం మిగతా అందరికీ మరో న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని సీఎం ఆరోపించారు. కాగా ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా ఎంఐఎం ఒక సీటు గెలుచుకున్నాయి. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మంగళవారం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular