విద్యారంగంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశంతో కలిసి సిఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పలువురు విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేవంత్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.