తెలుగు ప్రజలకు సిఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు
కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ’పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు… ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు.