Monday, May 12, 2025

కడప ఉప ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

* కడప ఉప ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
* వైఎస్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తానన్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వైఎస్ 75వ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ను తాము కుటుంబసభ్యుడిగా భావిస్తామని, ఎన్ని ఏళ్లు గడిచినా ఆయన్ను మరిచిపోలేమని ఈ సందర్బంగా అన్నారు రేవంత్. కడప లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే వైఎస్‌ షర్మిలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని, కడపలో షర్మిలకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
వైఎస్ జయంతి సందర్బంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనమండలిలో తాను మాట్లాడినప్పుడు వైఎస్‌ఆర్‌ ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ వైఎస్ ఎంతో ఉదారంగా ఉండేవారని.. మరీ ముఖ్యమంగా కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తపించేవారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఏ పదవీ రాకున్నా పార్టీని వీడలేదన్న రేవంత్ రెడ్డి.. గతంలో వైఎస్‌ఆర్‌ పోషించిన ప్రతిపక్ష పాత్రే ఇప్పుడు ఆయన కూతురు వైఎస్ షర్మిల పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఏఐసీసీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్ తో తమకున్న అనుబంధాన్ని, ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com