Wednesday, December 25, 2024

Scam in ORR tenders ఓఆర్​ఆర్​ టోల్​పై సిట్​

వాళ్లకోసమే ఓఆర్​ఆర్​ టెండర్లు కట్టబెట్టారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

గత ప్రభుత్వం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే ఓఆర్‌ఆర్ టెండర్లను కట్టబెట్టిందని సీఎ రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు ఓఆర్‌ఆర్ నిర్మించిందన్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి 65 శాతం ఆదాయం వస్తోందన్నారు. గురువారం అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” గత ప్రభుత్వం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే ఓఆర్‌ఆర్ టెండర్లను వాళ్లకు కట్టబెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌కు మణిహారంగా ఎయిర్‌పోర్టుతో పాటు ఓఆర్‌ఆర్ నిర్మించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి 65 శాతం ఆదాయం వస్తోందని” సీఎం రేవంత్ అన్నారు. విపక్ష పార్టీ కోరిక మేరకు ఔటర్ రింగ్‌ రోడ్‌ టోల్‌ కాంట్రాక్టుపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. హరీశ్ రావు కోరిక మేరకు సభ్యులందరి ఆమోదంతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొ్నారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు.

ఇదిలాఉండగా.. అసెంబ్లీలో సభా కార్యకలాపాలపై సభ్యలకు సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని విపక్షాలు అసంతృప్తి చేశాయి. ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారంటూ విమర్శలు చేశాయి. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఓఆర్​ఆర్​ టోల్​ టెండర్లపై సిట్​ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఔటర్​రింగ్ ​రోడ్డు టోల్​ కాంట్రాక్ట్​పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఔటర్​రింగ్​ రోడ్డును ఆయాచితంగా, అప్పనంగా ఎవరికో అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లీజ్​ మీద విచారణ జరపాలని హరీశ్​రావు కోరటం అభినందనీయమన్నారు. టెండర్లపై విచారణ జరిపేందుకు సిట్​ను ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. మంత్రివర్గంలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com