జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలో 27వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా షూ అందిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.