సీఎం రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌చాట్‌లో ఆయన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. చిట్ చాట్ చేశారు. అడ్డమైన వాళ్లతో తమకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి ఇప్పుడు కుటుంబం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. అడ్డమైన వాళ్లతో మాకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్.. నీ ఎఫైర్స్ గురించి జనాలకు చెప్పాలా? అంటూ నిలదీశారు. ఫార్ములా-ఈ వ్యవహారాన్ని నీ రేవంత్ వదిలినా తాము వదలమని, ఫార్ములా-ఈ రేస్ ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కచ్చితంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ ఉంటుందని హెచ్చరించారు.
ఢిల్లీకి రేవంత్ మూటలు..
రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని అన్నారు. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారో రేవంత్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరు ఎంటో అన్నీ తెలుసన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన జరుగుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారనే అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది.