Friday, December 27, 2024

సీఎం వర్సెస్‌..టాలీవుడ్‌ చర్చలు ఫలించలేదా?

సినీ ప్రముఖులతో భేటీకి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా… సినీ ప్రముఖుల ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశం అనంతరం.. సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇప్పటికే చేరుకున్న సినీ ప్రముఖుల జాబితాలో… దిల్ రాజు, సురేష్ బాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీమోహన్, త్రివిక్రం, సాయిరాజేష్, సీ. కల్యాణ్, హరీశ్ శంకర్, బీవీఎన్ ప్రసాద్, కిరణ్ అబ్బవరం, వశిష్ట, నవీన్, రవిశంకర్, గోపి ఆచంట మొదలైనవారు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికీ – తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చినట్లుందనే చర్చలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. సీఎంతో మాట్లాడి.. నిర్మాత, ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులతో పాటు 11 మంది నటులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశం జరిగే… కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఇప్పటికే సినీ ప్రముఖులు చేరుకున్నారు. ఇక ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు డీజీపీ, ఇతర అధికారులు పాల్గొనబోతున్నారని అంటున్నారు. .. సినీ పెద్దలు – తెలంగాణ సర్కార్ మధ్య తాజాగా జరుగుతున్న భేటీకి సంబంధించి ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా… సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. కులగణన సర్వేతో పాటు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కు సినిమా హీరోలు, హీరోయిన్లు మందుకు రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలకు సినీ ప్రముఖులు ప్రచార సహకారం అందించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో… సినిమా టిక్కెట్లపై ప్రత్యేక సెస్ ను ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే నిధులను ఇంటిగ్రేటేడ్ స్కూళ్లకు వినియోగించనున్నట్లు ప్రతిపాదించనున్నారని అంటున్నారు. .. సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా… ముందుగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారని అంటున్నారు. ప్రధానంగా… ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతోనే తమ ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందని తెలిపారని తెలుస్తోంది. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని.. అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రెటీలదే అని రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో… బౌన్సర్ల విషయంలోనూ సీఎం సీరియస్ గా స్పందించారని అంటున్నారు. ఒక్కొక్కరూ 30 – 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే.. వారేమో తమ ప్రతాపాన్ని సామాన్య ప్రజలపై చూపిస్తున్నారని అన్నారని సమాచారం! ఇదే సమయంలో.. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్ లో ఇండస్ట్రీ ఎటువంటి చొరవ చూపడం లేదని… ఆల్రెడీ గతంలో తాను సినిమా మొదలయ్యే ముందు ఓ పది నిమిషాల యాడ్‌ ఇవ్వమంటే ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రచారానికి హీరోలు, హీరోయిన్ లు ముందుకు రావాలని సీఎం ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో… ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలోనూ ఇండస్ట్రీ సహాకారం అందించాలని కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షో లు ఉండవంటూ చేసిన కామెంట్లకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించారని అంటున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా సీఎం ఉన్నారని తెలుస్తోంది. వందల కోట్లతో తెరకెక్కే సినిమాలకు బెనిఫిట్‌ షోలు, టికెట్‌రేట్లు పెంపు లేకపోవడం అనేది పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

 

 

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com