Wednesday, November 20, 2024

వరద బాధితులకు అపన్న హస్తంతో మేటి పశ్చిమగోదావరి జిల్లా

ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లా తరుపున రూ. 1,17,75,351 చెక్కును సిఎంకు అందించిన కలెక్టర్

లక్షలాది రూపాయలు వెచ్చించి తొలివారం ఆహార పదార్థాల పంపిణీ

కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవ, ప్రోత్సాహంతో విరాళాల వెల్లువ

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొనసాగిన వరద సహాయక చర్యలకు అండదండలు అందించటంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మేమున్నామంటూ తొలి వరుసలో నిలిచారు. ప్రభుత్వాధినేత పిలుపు మేరకు సేకరించిన విరాళాల మొత్తం రూ. 1,17,75,351లను శుక్రవారం అమరావతిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడికి అందించారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గురించి కలెక్టర్ ఈ సందర్భంగా సిఎంకు వివరించారు. యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

వరదల వేళ జిల్లా నుండి వారం రోజుల పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, ప్రజల అండదండలతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఆహార పదార్థాలను ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ తరలించామన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వరద బాధితులకు నిత్యవసరాలు, దుస్తులు, తదితర అవసరాలకు ఆర్థిక ప్రయోజనం అందచేయలన్న సిఎం పిలుపు మేరకు, అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించి విరాళాలు సేకరించామని తెలిపారు. ఈ క్రమంలో మంచి పనితీరును ప్రదర్శిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు కలెక్టర్ చదలవాడ నాగరాణిని అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో డ్రౌన్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన చంద్రబాబు చిత్రాన్ని బహుకరించారు.

విరాళాల వెల్లువ ఇలా : భీమవరం బివి రాజు విద్యాసంస్థలు అత్యధికంగా రూ. 25 లక్షలు, ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ రూ.11,76 904, రెవెన్యూ ఉద్యోగులు రూ.7,62,039 విరాళాన్ని అందించి గొప్పతనాన్ని చాటుకున్నారు. రైతులకు అండగా నిలిచే సహకార సంఘాలు రూ.6,05,053, స్వామి వివేకానంద సేవాసమితి, శ్రీ గోపికృష్ణ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, భీమవరం హాస్పిటల్స్ యాజమాన్యం రూ.5 లక్షలు చొప్పున అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మిలటరీ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సమాఖ్య సంఘం, మోహన్ పెట్రోల్ బంక్ యజమాన్యం, చిన్నారులు వారు దాచుకున్న మొత్తాన్ని అందజేయడం, ఇలా ఒకరు, ఇద్దరు కాదు వేలాదిమంది వారి ఆపన్న హస్తం అందించారు. గొల్లలకోడేరు కు చెందిన సుమారు 80 సంవత్సరాల వయవృద్ధురాలు దాట్ల పరిపూర్ణావతి స్వయంగా జిల్లా కలెక్టర్ ను కలిసి పదివేల రూపాయలు అందించడంలో అమె ఔదార్యం వెలకట్టలేనిదిగా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular