Friday, December 27, 2024

అంతా క‌లిసి రండి

స‌మస్య‌లుంటే చ‌ర్చిద్దాం
రియ‌ల్ రంగానికి అండ‌గా ఉంటాం
మాది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం
న‌రెడ్కో ప్రాప‌ర్టీ షోలో మంత్రి ఉత్త‌మ్‌

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య పాల‌న న‌డుస్తుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు వినేందుకు సిద్దంగా ఉన్నామ‌ని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతిలో నరెడ్కో ఒక భాగం అని, త‌మ‌ ప్రభుత్వం నరెడ్కోకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న అనుమతులను మా ప్రభుత్వం ఎట్టిప‌రిస్థితుల్లోనూ రద్దు చేయదని భ‌రోసా ఇచ్చారు. రాష్ట్రంలోని క్రెడాయ్‌, ట్రెడ్కో, నరెడ్కో కలిసిక‌ట్టుగా ఒక కమిటీ ఏర్పాటు చేయాల‌ని, నెలకు ఒకసారైనా ఆ క‌మిటీతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్ చెప్పారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్ర‌వారం నరెడ్కో ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైద‌రాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పెట్టి పెరిగారని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ నిర్మించిందని, ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్‌ నిర్మిస్తున్నామ‌ని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతున్నట్లు ప్ర‌క‌టించారు. ప్రపంచ స్థాయి స్కిల్‌ వర్సిటీ, స్పోర్ట్స్‌ వర్సిటీ తీసుకొస్తున్నామ‌ని, నగరంలో మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.10వేల కోట్లు కేటాయించామ‌న్నారు. ప్రభుత్వం వ్యాపార రంగానికి అండగా ఉంటుందని, ఇప్పుడు న‌డుస్తున్న‌ది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని, గత ప్రభుత్వాల మాదిరి కాదు అని ఉత్తమ్‌ అన్నారు.
ఇక‌, హైడ్రా కూల్చివేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అనుమతులు ఉన్న నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసారు. హైడ్రా కూల్చివేతలు శాసనబద్ధమైన చర్యలలో భాగమని తెలియజేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో మెట్రో విస్తరణ మరియు ఇతర పెద్ద ప్రాజెక్టులు జరుగుతాయని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com