Friday, April 18, 2025

పెట్టుబడులకు ఆహ్వానం

  • పరిశ్రమలకు అనుకూలంగా రాష్ట్రం
  • ఇస్వాయ్​ ప్రతినిధులతో సీఎం రేవంత్​

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఇస్వాయ్​( ISWAI) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

క్రెడాయ్​కు రండి… సీఎంకు ఆహ్వానం
ఆగస్టులో జరిగే క్రెడాయ్ ఈవెంట్‌ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని క్రెడాయ్​ ప్రతినిధులు ఆహ్వానించారు. వచ్చే నెలలో క్రెడాయ్ రాష్ట్ర స్థాయి సదస్సు స్టాకన్-= 2024ను ప్రారంభించాలని కోరారు. ఈ ఈవెంట్ బిల్డర్ల సోదరభావానికి సంబంధించిన వివిధ సమస్యలను అన్ని వాటాదారుల సమక్షంలో పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 900 మంది డెవలపర్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. క్రెడాయ్ తెలంగాణ ఆఫీస్ బేరర్లు –మురళీకృష్ణారెడ్డి, ప్రేంసాగర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com