Friday, January 10, 2025

ఆడియన్స్‌ ఎట్రాక్ట్‌ అవ్వాలంటే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తప్పవు

* హీరో యష్ పూరి

“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలంటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా . ఈ నటించింది” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నచిత్రానికి యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ “హ్యాపీ ఎండింగ్” కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ప్రస్తుతం ట్రెండీగా ఉన్న కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఆ శాప విముక్తి ఎలా మారుతుంది అన్నది కథాంశం. ఆ శాపాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఆ కుర్రాడు పడే కష్టాలు ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్..ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ “హ్యాపీ ఎండింగ్” సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం.

మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా “హ్యాపీ ఎండింగ్”. శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యుఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను. వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. లవ్ ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో హీరో హర్ష్ క్యారెక్టర్. “హ్యాపీ ఎండింగ్” సినిమాలో పాటలు, కామెడీ బాగా వచ్చాయి. ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అదే ఈ సినిమా కథకు అసలైన పాయింట్. శాపం అనేది ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ మాత్రమే.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com