Friday, April 11, 2025

పదోన్నతులు రావు… బదిలీలు జరగవు..?

  • కమర్షియల్ ట్యాక్స్‌లో ఆగిన బదిలీలు..!
  • పదోన్నతులు రాకుండా డిపిసిని అడ్డుకుంటున్న ఇద్దరు జేసిలు
  • గత ప్రభుత్వంలో నూ వీరిపై భారీగా అవినీతి ఆరోపణలు
  • ప్ర సు ్త తం సచివాలయంలో ఓ ఉన్నతాధికారితో సత్ససంబంధాలు
  • పలు జిల్లాలో ఇన్‌చార్జీ సిటిఓలతో పనులు నత్తనడక
  • కిందిస్థాయిలో నూ పదోన్నతులు కల్పించాలని ఆ శాఖ ఉద్యోగుల డిమాండ్

కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ)లో ఇన్‌చార్జీ సిటిఓల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలో ఇన్‌చార్జీ సిటిఓలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సిటిఓలు రెండుచోట్ల ఇన్‌చార్జీలుగా వ్యహారించాల్సి రావడంతో వారిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం ఆ శాఖకు చెడ్డపేరు తీసుకువస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతనెలలో సాధారణ బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా గత కమిషనర్ దానిని పట్టించుకోక పోవడంతో బదిలీల ప్రక్రియ ఆ శాఖలో జరగలేదు. దీంతోపాటు కొందరు అధికారుల పదోన్నతుల విషయంలోనూ ఆలస్యం కావడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఆగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అదనపు కమిషనర్‌లుగా పదోన్నతులు ఇచ్చి జేసిలుగా కూడా అవకాశం….
ఇద్దరు జేసి స్థాయి అధికారులు ఈ పదోన్నతులు జరగకుండా అడ్డుకుంటున్నారని, వారికి జేసి నుంచి అదనపు కమిషనర్‌లుగా పదోన్నతులు వస్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న డివిజన్‌లు వారి నుంచి చేజారిపోయే అవకాశం ఉందని, అలాకాకుండా పదోన్నతులను తరువాత తీసుకోవాలన్న ఉద్ధేశ్యంతో వారు ఇలా వ్యవహారిస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఇద్దరు జేసిలు పనిచేసే డివిజన్‌లు అధికంగా ఆదాయం వచ్చేవి కావడంతో వారు వాటిని వదులుకోలేకపోతున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. పదోన్నతులకు సంబంధించి డిపిసి జరగకుండా సచివాలయంలో ఈ ఇద్దరూ అధికారులు లాబీయింగ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ తమకు అదనపు కమిషనర్‌లుగా పదోన్నతులు కల్పిస్తే దాంతోపాటు తాము ప్రస్తుతం పనిచేసే ఆ రెండు డివిజన్‌లకు ఇన్‌చార్జీ జేసిలుగా తమకే అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఇద్దరు జేసిలపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ప్రభుత్వానికి సైతం వారిపై ఫిర్యాదులు అందినట్టుగా సమాచారం. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ ఇద్దరూ జేసిల పనితీరు బాగాలేకపోవడం, అవినీతి ఆరోపణలు భారీగా రావడంతో అప్పటి సిఎస్ సైతం వారిని హెచ్చరించినట్టుగా తెలిసింది. అయినా మారని ఈ ఇద్దరు జేసిలు ప్రస్తుతం సచివాలయంలోని ఓ ఉన్నతాధికారిని ప్రసన్నం చేసుకొని తాము అనుకున్నట్టుగా ఈ కథ నడిపిస్తున్నట్టుగా తెలిసింది. ఒక జేసి అయితే ఏకంగా ఆ ఉన్నతాధికారి ఇంటికి కావాల్సిన వస్తువులను, సరుకులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన కమిషనర్‌లను సైతం ఇదే విధంగా ఆ జేసి మచ్చిక చేసుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

ఖాళీగా ఉన్న సిటిఓ సీట్ల వివరాలు
సంగారెడ్డిలో రెండు సిటిఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా స్థానాల్లో ఇన్‌చార్జీ సిటిఓలు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి, నల్లగొండలోని మిర్యాలగూడ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల ఇన్‌చార్జీ పోస్టులతో కాలం వెల్లదీస్తుండగా, సూర్యాపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, కోదాడ తదితర ప్రాంతాల్లోనూ ఇన్‌చార్జీ సిటిఓల పాలన కొనసాగుతుండడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com