Wednesday, April 30, 2025

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

  • సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ
  • భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం
  • ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన

ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది. పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి పాల్పడి వారం రోజులు పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ దాడి తర్వాత కేంద్రం పాకిస్థాన్‌కు బుద్ధి వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు దృఢచిత్తంతో ఉన్నమని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడం జాతీయ సంకల్పం అని ఆయన అన్నారు.

సాయుధ దళాల సామర్థంపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. తీవ్రవాదం అణిచివేయడంలో, అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ పూర్తిగా సైన్యానిదే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు- కొనసాగింది. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌సిడిఎస్‌ ‌జనరల్‌ అనిల్‌ ‌చౌహాన్‌, ‌జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోబాల్‌ ‌పాటు- వివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఉగ్రవాదాన్ని అణచివేయాలనేదే దేశ సంకల్పమని ప్రధాని మోదీ  ఉద్ఘాటించారు.చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌సహా త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో అంతర్గత భద్రత, సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న వారిని పాతాళంలో తొక్కేస్తామని స్పష్టం చేసినట్లు- తెలుస్తోంది. అంతేకాదు, వారి ఊహకందని రీతిలో చర్యలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రఘటనకు ప్రతీకార దాడులు తప్పవని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రధాని మోదీ మాటలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.  మరోవైపు భద్రతారంగ కేబినెట్‌ ‌కమిటీ బుధవారం సమావేశం కానుంది.

వారం రోజుల వ్యవధిలో భేటీ- కానుండటం రెండోసారి. అనంతరం మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ ‌కమిటీ- సమావేశం కానుందని సమాచారం. ఇందులో సీసీఎస్‌లోని ఐదుగురు సభ్యులతో పాటు- రవాణా, ఆరోగ్య, వ్యవసాయ, రైల్వే మంత్రులు ఉన్నారు. ఇలా కీలక భేటీ-లు జరిగే ఒకరోజు ముందే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు- చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే, 2016లో ఉరిలో ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. అనంతరం 2019లో సీఆర్పీఎఫ్‌ ‌బలగాలే లక్ష్యంగా పుల్వామాలో జరిగిన దాడి అనంతరం భారత సైన్యం సర్జికల్‌ ‌స్టయ్రిక్్ర‌‌చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com