సూపర్ వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ ఉద్యోగులతో పాటు స్వీపర్స్ ఆందోళనకు దిగారు. సూపర్ వైజర్లు కొంత కాలంగా తమను కులం పేరుతో దూషించడమే కాకుండా మహిళలు అని కూడా చూడకుండా బండ బూతులు తిడుతూ పని చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినట్టుగా వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయాందోళనకు గురి చేస్తున్నారని, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వారంతా నిరసనకు దిగారు.
సిబ్బంది ఆందోళనతో ఉదయం నుంచి కాంట్రాక్టర్ ను సంప్రదించేందుకు ఉన్నతాధికారుల ప్రయత్నించినా కెవిఆర్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. సిబ్బంది ఆందోళనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతుండడం విశేషం.