Wednesday, December 25, 2024

కొందరికే రుణ ‘మాఫీ’ ఆంక్షలు అమలు

పంద్రాగస్టులోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డెడ్ లైన్ విధించుకున్న తెలంగాణ ప్రభుత్వం అమలులో కొన్ని షరతులు విధించనున్నట్లు తెలుస్తోంది. సాగు చేస్తోన్న రైతులు, ఆర్థికంగా వెనకబడిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే రైతు భరోసా స్కీమ్ వర్తింపు విషయంలో సాగు చేస్తోన్న రైతులకే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోన్న రేవంత్.. రుణమాఫీని కూడా అసలైన రైతులకే వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు విషయంలో మోడీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది అని రేవంత్ ఇటీవల కేంద్ర అధికారులతో ఆరా తీశారు. ఈ పథకం ద్వారా ఐటీ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, ఎంపీలు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో కొనసాగుతోన్న వారికి సాయం అందటం లేదు. దీంతో కేంద్రం ఎలాగైతే పీఎం కిసాన్ నిధి అమలు విషయంలో ముందుకు వెళ్తుందో రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే షరతులు విధించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ, రైతుబంధు పథకాలను బడా లీడర్లు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న ఉన్నవారికి సైతం వర్తింపజేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారాక రైతుబంధు స్థానంలో తీసుకొచ్చిన రైతు భరోసాను అసలైన రైతులకు అమలు చేయాలని సమాలోచనలు జరుపుతోన్న సర్కార్.. రైతు రుణమాఫీ విషయంలో ప్రజా ప్రతినిధులకు దీనిని వర్తింపజేయోద్దని భావిస్తున్నట్లు సమాచారం. సాగు చేస్తోన్న రైతులు, ఆర్థికంగా వెనకబడిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రుణమాఫీ అమలు విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com