Tuesday, December 24, 2024

DGP suspend డీజీపీపై వేటు..?

రాష్ట్రంలో తాజా ప‌రిస్థితులు.. ఉన్న‌తాధికారుల మెడ‌కు చుట్టుకుంటున్నాయి. తాజాగా లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ముఖ్య పోలీస్ అధికారులపై వేటు వేయడానికి సిద్ధమైంది. డీజీపీ, డీఐజీ, ఎస్పీ తదితర ముఖ్య అధికారులను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్ల గ్రామంలో ఈ నెల 11న కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న సురేష్ దాడికి ముందు వారం రోజులు గ్రామస్తులతో సమావేశం అయి రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. కలెక్టర్ ఎవరు వచ్చినా తరిమికొడదాం అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సైతం తాజాగా బయటకు వచ్చింది. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని గుర్తించి అలర్ట్ కాకపోవడంపై రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత గ్రామ శివరులో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే.. దాడి చేయాలన్న కుట్రతోనే నిందితులు అధికారులను గ్రామంలోకి రావాలని తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది.

బందోబస్తు లేకుండా గ్రామంలోకి కలెక్టర్..
జిల్లా అత్యున్నత అధికారి అయిన కలెక్టర్ ను సరైన బందోబస్తు ఇవ్వకుండా, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా గ్రామంలోకి తీసుకెళ్లడంపై ఎస్పీ, స్థానిక అధికారులపై ఇప్పటికే మంత్రి సీరియస్ అయ్యారు. ఎస్పీ, తహసీల్దార్, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్తులు ఇష్టారీతిగా దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాల్లో పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో బందోబస్తు, నిఘా వర్గాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. డీజీపీని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. లేకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్‌, డీఐజీ, ఎస్పీలను కూడా మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. కింది స్థాయిలో ఎస్ఐ, సీఐ తదితర అధికారులపై మాత్రం వేటు ఖాయమని అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com