Monday, May 5, 2025

రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం..

  • రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం..
  • నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు టీపీసీసీ పిలుపు.

ఈ రోజు శుక్రవారం మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల కేటీఆర్ అనుచితంగా మాట్లాడారని..మహిళలను కించపరుస్తూ బస్ లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు చేయండి అంటూ అత్యంత ఆవహేళన గా మాట్లాడారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపు నిస్తుంది.

నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో మహిళలతో పాటు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై, మహిళలపై ఇక నుంచి ఎవరు అవమాన పరిచే విధంగా మాట్లాడినా, వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com