కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కట్టలు కట్టడం పూర్తి కావడంతో మొదటి రౌండ్ కౌంటింగ్ ను అధికారులు పూర్తి చేశారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్ లో కూడా ఆధిక్యం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని భావించారు. కానీ, బీజేపీ అభ్యర్ధి లీడ్‌లో కొనసాగుతున్నారు.
మొదటి రౌండ్‌లో అంజిరెడ్డికి 6712 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6676 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా మంచి పోటీ ఇస్తున్నారు. తొలి రౌండ్ లో ఆయనకు 5867 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కించనుండగా.. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ ను ప్రారంభించారు.
ఇక రెండవ రౌండులో కూడ బీజేపీ హవా కొనసాగుతున్నది. బీజేపీ అంజిరెడ్డికి 14690 ఓట్లు రాగా.. కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి 13198 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు 10746 ఓట్లు వచ్చాయి. రెండవ రౌండులో 1492 లీడ్తో బిజేపి అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు.