‘రెండువేల రూపాయలు ఉన్న పింఛన్‌ను నాలుగువేలకు పెంచి ఇస్తం’ అని ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు.
44 లక్షల మందికిపైగా లబ్ధిదారులు
దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది’రెండువేల రూపాయలు ఉన్న పింఛన్‌ను నాలుగువేలకు పెంచి ఇస్తం’ అని ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు.
వందరోజుల్లోనే హామీని అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఊసెత్తడం లేదు. ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛను అందుకుందామా? అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తుంటే పాతపద్ధతిలోనే పైసలు వేసి ‘చెయ్యి’చ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.2 వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచుతామని చెప్పింది. ఈ హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికి 240రోజులైంది. రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్ల లబ్ధిదారులు మొత్తం 44లక్షల మంది ఉన్నారు. వీరంతా పెరిగిన పింఛన్ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. వీరిలో దాదాపుగా ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. మిగతావారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గౌడ, హెచ్‌ఐవీ, బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు ఉన్నారు.
సమాజంలో నిస్సహాయులుగా ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మొదట పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచి అందించింది. రెండో టర్మ్‌లో 2,000కు పెంచింది. 2014 నవంబర్‌లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి కరోనా లాంటి కష్టకాలంలోనూ నిరాటంకంగా అందించింది. ప్రారంభంలో వృ ద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు అందజేసింది. 2015 మార్చి బీడీ కార్మికులకు, 2017 ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు, 2018 ఏప్రిల్‌ని ఫైలేరియా బాధితులకు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లను వర్తింపజేసింది. త్వరలోనే పింఛన్ల చెల్లింపునకు సిద్ధమవున్న కాంగ్రెస్ ప్రభు త్వం, పాత విధానంలోనే వెళ్లేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. 44లక్షల మంది లబ్ధిదారులకు పింఛను ఇ వ్వాలంటే నెలకు సగటున వెయ్యి కోట్ల చొప్పున ఖర్చవుతుందని, ఇప్పుడా మొత్తా న్ని రెట్టింపు చేయడం వల్ల మరో వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. కొత్తగా అసరా పింఛను కోసం ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులన్నీ అటకెక్కినట్టు తెలుస్తున్నది. ఉన్న పింఛన్లను పెంచి ఇవ్వడంపైనే దృష్టిపెట్టని ప్రభుత్వం, కొత్తవి ఎలా ఇస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.