Monday, March 24, 2025

లంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

  • నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి?
  • ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు..
  • రాష్ట్రంలో అసమర్థ పాలన
  • అందుకే మళ్లీ పాదయాత్రలుధర్నాలుకొట్లాటలు
  • బిఆర్ఎస్ అధినేతమాజీ సీఎం కేసీఆర్

తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులుకాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు
తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ నేటి దాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎన్నోసారి  మోసాలు చేసిందని విమర్శించారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీసోనియాగాంధీ నుంచి నేటి దాకా కాంగ్రెస్ తెలంగాణకు జరిగిన ద్రోహలను కెసిఆర్ ఈ సందర్భంగా వివరించారు.

గతేడాది ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో ఇందుకు కారణం ఎవరు అనే విషయాన్ని సభ్యాసమాజానికి తెలియజేసేందుకు రామగుండం మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగి శనివారం ముగిసింది. ఈ ముగింపు సభ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది. పోయిన సంవత్సరం ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో ఇందుకు కారణం ఎవరు అనే విషయాన్ని సభ్యాసమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయం అని పాదయాత్రలో పాల్గొన్నప్రతీ ఒక్కరినీ కేసీఆర్ అభినందించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com