Friday, May 16, 2025

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం

ఎస్సీ వర్గీకరణ బాధ్యత సిఎం రేవంత్ రెడ్డిదే
కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల నుంచి మాదిగలు పోరాటం చేస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్నారు. మంద కృష్ణ మాదిగ 2017 నుంచి బిజెపిని పొగుడుతున్నారని, అయినా బిజెపి ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి అనుకుంటే మూడు రోజుల్లో బిల్లు ప్రవేశపెట్టవచ్చని, కానీ, ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

బిజెపి పుట్టిందే రాజ్యాంగం రద్దు చేయడం కోసం: పిడమర్తి రవి
బిజెపి నమ్మితే దళిత జాతికే ముప్పు పొంచి ఉందని, టిక్కెట్లు కోసం తామే పోరాటం చేశామని, టిక్కెట్ల కేటాయింపులకు సంబంధించి సిఎం రేవంత్‌రెడ్డి చెప్పిన అంశాలకు తాము అంగీకరించామని కాంగ్రెస్ నాయకులు పిడమర్తి రవి పేర్కొన్నారు. బిజెపి పుట్టిందే రాజ్యాంగం రద్దు చేయడం కోసమని ఆయన ఆరోపించారు. పది శాతం ప్రజానీకం కోసం బిజెపి పని చేస్తుందన్నారు. మళ్లీ బిజెపి గెలుస్తే అనేక ఇబ్బందులు వస్తాయని, అందుకు బిజెపిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదిగలకు నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ కల్పించిందన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com