Tuesday, April 22, 2025

Harish Rao: కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రి హరీష్‌రావు టార్గెట్…!

  • అప్పుడు అగ్గిపెట్టే….ఇప్పుడు పెన్ను దొరకలేదా అంటూ ట్రోలింగ్
  • ఇప్పటికైనా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ నేతలు, శ్రేణులు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేతల హరీశ్ రావు టార్గెట్‌గా సామాజిక మాధ్యమాల్లో ముప్పేట దాడికి దిగుతున్నారు. పంద్రాగస్టులోగా పంటరుణమాఫీ చేసి చూపించామని హరీశ్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ లో తమదైన శైలిలో మాజీ మంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేటలో పెట్రోల్ పైన పోసుకున్న హరీశ్ రావుకు అగ్గిపెట్టే దొరకలేదని, ఇప్పుడు రాజీనామా పత్రంపై సంతకం చేసేందుకు పెన్ను దొరకడం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇదే అదనుగా తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నాయకులు తెరపైకి తెస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రినిక చేయకపోతే తలనరుక్కుంటానంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను వైరల్ చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథ నీళ్లియ్యకపోతే ఓట్లడగను అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. కెసిఆర్ ఫాంహౌస్ సిఎం అని రేవంత్ రెడ్డి ఫార్మర్స్ రిఫార్మర్ అంటూ పోస్టర్లను పోస్ట్ చేస్తున్నారు. ఎంపి రేణుకా చౌదరి హరీశ్ రావు రాజకీయ సన్యాసం తీసుకోవాలని, ఏకంగా కాషాయ వస్త్రాలనే పంపుతాని ప్రెస్ మీట్ లో చెప్పగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించడం విశేషం.

గన్‌పార్కు వద్దకు ఉద్యమకారులు
అబద్దాల హరీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు వివిధ రూపాల్లో చేస్తున్నారు. ఇదిలా ఉండగా అబద్ధాల హరీశ్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రుణమాఫీ చేసిన సిఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com