- ఎస్సీ వర్గీకరణపై బిఆర్‌ఎస్‌కు చిత్త శుద్ధి లేదు
- కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేశామని, ఈ పోరాటంలో అనేక మంది యువకులు చనిపోయారని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పని చేశారని, ఈ విషయాన్ని తాము కాదనడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలికారని, వైఎస్ హయాంలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ హయాంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారని, కానీ, బిఆర్‌ఎస్‌కు చిత్త శుద్ది లేదని ఆయన విమర్శించారు.
ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు వెళ్లలేదన్నారు. ఎవరు కూడా ఎస్సీ వర్గీకరణపై అడ్వకేట్‌ను పెట్టలేదని, రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక అడ్వకేట్‌ను పెట్టారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వల్ల ఎస్సీ వర్గీకరణ అయ్యిందని మందకృష్ణ అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుంచి 2024 వరకు ఎందుకు మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి మోడీ, అమిత్ షాలు ఏంచేశారని ఆయన నిలదీశారు. బిజెపి, మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెట్‌లో బిల్లు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.