కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. శ్రీశైలం జాతీయ రహదారితో పాటు పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల సబితారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్‌లో మంత్రి పదవులను అనుభవించిన మాజీ మంత్రి సబితారెడ్డి కాంగ్రెస్ నాయకులపైనే ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదని, సిఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ గురువారం సిఎం దిష్టి బొమ్మల దహనానికి బిఆర్‌ఎస్ పిలుపునివ్వగా అదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై సబితారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల ఆమె దిష్టి బొమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.